ఈ నటి చాలా లక్కీ అట..! | sayesha saigal romance with ilayathalapathy vijay | Sakshi
Sakshi News home page

ఈ నటి చాలా లక్కీ అట..!

Feb 9 2018 9:40 PM | Updated on Feb 9 2018 10:02 PM

sayesha saigal romance with ilayathalapathy vijay - Sakshi

సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్‌ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్‌ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్‌లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్‌ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్‌, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్‌ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్‌ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్‌ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్‌. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.  ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement