గృహప్రవేశం

Savyasachi Shoot At Majestic House Set - Sakshi

సినీ స్టార్‌కి ఒక హౌస్‌ నచ్చాలంటే అది ఎలా ఉండాలి? సూపర్బ్‌ డిజైన్‌ విత్‌ ఆల్‌ ఫెసిలిటీస్‌ అండ్‌ ఫర్నిచర్‌తో అదిరిపోవాలి. అలాంటి ఇల్లు కట్టాలంటే ఎట్‌లీస్ట్‌ వన్‌ ఇయర్‌ టైమ్‌ పడుతుంది. కానీ, యాక్టర్‌ మాధవన్‌ ఇంటిని మాత్రం హైదరాబాద్‌లో 25 డేస్‌లో కట్టేశారు. భాగ్యనగరానికి ఆయనెప్పుడు మకాం మార్చారు? అనే డౌట్‌ క్లారిఫై కావాలంటే మేటర్‌కు బ్రేక్‌ ఇవ్వకుండా కంటిన్యూ చేయండి. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమాలో మాధవన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ను సిక్స్‌ డేస్‌ బ్యాక్‌ స్టార్ట్‌ చేసిన షెడ్యూల్‌లో మాధవన్‌ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మాధవన్‌ ఉండే ఇంటిని సెట్‌గా వేయించారు నిర్మాతలు. ఇది కాస్ట్‌లీ సెట్‌ అని, పూర్తవడానికి 25 రోజులు పట్టిందని పేర్కొన్నారు. అంటే.. మాధవన్‌ రీల్‌ లైఫ్‌లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారన్నమాట. అన్నట్లు.. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో అసలు సిసలు పల్లెటూరిని తలపించేలా బ్రహ్మాండంగా సెట్స్‌ వేసిన రామకృష్ణనే ‘సవ్యసాచి’కి కూడా ఆర్ట్‌ డైరెక్టర్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘‘నీలో మంచి బ్రదర్‌ ఉన్నాడని నాకు తెలుసు. కానీ, సౌత్‌ మొత్తం నిన్ను ఇష్టపడుతున్నారు. దానికి కారణం నువ్వు మంచి హ్యూమన్‌ బీయింగ్‌. నీతో కలసి సినిమా చేయడం  ఆనందంగా ఉంది’’  అని నాగచైతన్య బర్త్‌డే (నవంబర్‌ 21) సందర్భంగా మాధవన్‌ అంటే, ‘‘నువ్వు మా సినిమాలోకి వచ్చినందుకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని చైతూ అన్నారు. ఈ మాటలను బట్టి ఈ ఇద్దరూ ఎంతగా కనెక్ట్‌ అయ్యారో అర్థమవుతోంది. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ బ్రహ్మాండంగా వర్కవుట్‌ అవుతాయని కూడా ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top