వినోదాత్మక సందేశం | Satya Gang Movie Press Meet | Sakshi
Sakshi News home page

వినోదాత్మక సందేశం

Feb 22 2018 12:11 AM | Updated on Feb 22 2018 12:11 AM

Satya Gang Movie Press Meet - Sakshi

సాత్విక్‌ ఈశ్వర్, అక్షిత

సాత్విక్‌ ఈశ్వర్, అక్షిత జంటగా రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్‌’. ఈ చిత్రానికి ప్రభాస్‌ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించారు. మహేష్‌ ఖన్నా నిర్మాత. ఈ సినిమా ఆడియో సక్సెస్‌మీట్‌ కర్నూలులో నిర్వహించారు. మహేష్‌ ఖన్నా మాట్లాడుతూ– ‘‘సమాజంలో అనాథలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది. మా డైరెక్టర్‌ ప్రభాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గానూ మంచి మార్కులు సంపాదించారు. మార్చి 15న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చిందన్నా.. మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోందన్నా అందుకు కారణం మా నిర్మాత మహేష్‌ ఖన్నా’’ అన్నారు ప్రభాస్‌. ‘‘  సాత్విక్‌ ఈశ్వర్, అక్షిత, సినిమాటోగ్రాఫర్‌ అడుసుమిల్లి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement