నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత | Sarvam Siddham Teaser Launch | Sakshi
Sakshi News home page

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

Aug 2 2019 2:53 AM | Updated on Aug 2 2019 2:53 AM

Sarvam Siddham Teaser Launch - Sakshi

రవళి,సర్వం శ్రీనివాస్

సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’.  సినెటేరియా మీడియా వర్క్స్‌ పతాకంపై శ్రీలత బి. వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వీఎన్‌ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్‌ విడుదల చేశారు. వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్‌లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు.

‘‘టీజర్‌ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్‌. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్‌ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్‌ సీఈవో వెంకట్‌ బులెమోని, ఎన్‌.సి.సి మార్కెటింగ్‌ హెడ్‌ శ్రీవికాస్, సింబయోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్‌ జైన్, టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’  చిత్రం హీరో సాగర్‌ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్‌ సంతోష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్‌ జి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement