అయ్య బాబోయ్‌ అసలు కలెక్షన్లు ఆగట్లా..

Sarileru Neekevvaru Blockbuster Ka Baap Promo Released - Sakshi

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్‌లో ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్‌ వసూలు చేసిందని ప్రకటించింది. అలాగే కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. 

అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రోమోలను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ఒకదానిలో ప్రకాశ్‌ రాజ్‌తో మహేష్‌ అయ్య బాబోయ్‌.. ఫ్లో ఆగట్లేదని పలికే సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. ‘అయ్య బాబోయ్‌ అసలు కలెలక్షన్లు ఆగట్లా..’ అని పేర్కొంది. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, సంగీత కీలక పాత్రల్లో నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top