పదహారేళ్ల సంతోషం | Santosham South Indian Film Awards 2018 Curtain Raiser Event | Sakshi
Sakshi News home page

పదహారేళ్ల సంతోషం

Aug 4 2018 1:47 AM | Updated on Aug 4 2018 1:47 AM

Santosham South Indian Film Awards 2018 Curtain Raiser Event - Sakshi

మాదవపెద్ది సురేష్, బెనర్జీ, శ్రీకాంత్, నిత్యా శెట్టి, సురేష్‌ కొండేటి, కిరణ్‌ గౌడ్‌

‘‘సురేష్‌తో నాకు 23 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. నాకు తమ్ముడులాంటివాడు. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌)కు బాగా సహకరిస్తున్నారు. 16 ఏళ్లుగా ‘సంతోషం’ అవార్డులను ఇవ్వడం చిన్న విషయం కాదు. చాలా ప్యాషన్‌ ఉండాలి. ఎంతో  శ్రమపడాలి. అవన్నీ సురేష్‌లో ఉన్నాయి కాబట్టే అవార్డుల వేడుకను ఇన్నేళ్లుగా గ్రాండ్‌గా చేయగలుగుతున్నారు’’ అని హీరో శ్రీకాంత్‌ అన్నారు. ‘సంతోషం’ సినిమా పత్రిక 16 ఏళ్లు పూర్తిచేసుకుని 17వ ఏటలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సంతోషం’ అవార్డులకు సంబంధించిన కర్టన్‌ రైజర్‌ ఫంక్షన్‌ గ్రాండ్‌గా జరిగింది.

శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఇతర సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డులకు దీటుగా ‘సంతోషం’ అవార్డులను అందజేస్తున్నారు. సురేష్‌ అటు నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. తను ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ నెలలో నిర్వహించే సంతోషం అవార్డుల ఫంక్షన్‌ గ్రాండ్‌గా సక్సెస్‌ కావాలి’’ అన్నారు సంగీత దర్శకులు మాదవపెద్ది సురేష్‌. ‘‘ఆగస్టు 1తో ‘సంతోషం’ 16 సంవత్సరాలు పూర్తి  చేసుకుని 17లోకి  అడుగుపెట్టింది. అందుకే కర్టన్‌ రైజర్‌ వేడుకను గురువారం ఓ సెంటిమెంట్‌గా చేస్తాం. ఈ నెలలోనే అవార్డులు అందించనున్నాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేష్‌ కొండేటి. నటుడు బెనర్జీ, హీరోయిన్‌ నిత్యాశెట్టి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement