ఖల్నాయక్ రిటర్న్స్ | sanjaydutt to star in khalnayak sequal | Sakshi
Sakshi News home page

ఖల్నాయక్ రిటర్న్స్

Oct 14 2015 9:54 AM | Updated on Sep 3 2017 10:57 AM

ఖల్నాయక్ రిటర్న్స్

ఖల్నాయక్ రిటర్న్స్

బాలీవుడ్ బ్యాడ్బాయ్ సంజయ్ దత్ కోసం మరో ఆసక్తికరమైన సీక్వెల్ను రెడీ చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'ఖల్నాయక్'కు సీక్వెల్...

బాలీవుడ్ బ్యాడ్బాయ్ సంజయ్ దత్ కోసం మరో ఆసక్తికరమైన సీక్వెల్ను రెడీ చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'ఖల్నాయక్'కు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సుభాష్ ఘయ్. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ లీడ్రోల్స్లో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.

ఈ సీక్వెల్ కు 'ఖల్నాయక్ రిటర్న్స్' అన్న టైటిల్ను కూడా ఫైనల్ చేశాడు సుభాష్ ఘయ్. అయితే ప్రస్తుతం ఎర్రావడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్, ఈ సీక్వెల్ కు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. తన మీద ఉన్న బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను చెరిపేసుకోవాలనుకుంటున్న సంజయ్ మరోసారి ఇలాంటి పాత్రలో నటిస్తాడా లేక సుభాష్ ఘయ్ ఆఫర్ ను తిరస్కరిస్తాడా చూడాలి.

తన కూతురు ఆపరేషన్ సందర్భంగా ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చిన సంజయ్దత్, విదు వినోద్ చోప్రా, రాజ్కుమార్ హిరానీలను కలిశాడు. వీరి కాంబినేషన్లో మున్నాభాయ్ సీక్వెల్పై కూడా చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మరి సంజయ్, ఏ సీక్వెల్ను పట్టాలెక్కిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement