కార్తీ సినిమా సీక్వల్లో సందీప్ | Sandeep Kishan in Naa Peru Siva Sequel | Sakshi
Sakshi News home page

కార్తీ సినిమా సీక్వల్లో సందీప్

Mar 9 2017 11:34 AM | Updated on Sep 15 2019 12:38 PM

కార్తీ సినిమా సీక్వల్లో సందీప్ - Sakshi

కార్తీ సినిమా సీక్వల్లో సందీప్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా తెలుగు తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన సినిమా నా పేరు శివ. లవ్ అండ్ రివేంజ్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా తెలుగు తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన సినిమా నా పేరు శివ. లవ్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ సరసన కాజల్ హీరోయిన్గా నటించింది. అయితే ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ను ప్లాన్ చేస్తున్నారట. తొలి భాగానికి పనిచేసిన అదే టెక్నికల్ టీం ఈ సీక్వల్ కోసం వర్క్ చేస్తోంది. కానీ రెండో భాగంలో హీరో మాత్రం మారిపోనున్నాడు.

తొలి భాగంలో కార్తీ హీరోగా నటించగా సీక్వల్కు తెలుగు యువ హీరో సందీప్ కిషన్ను తీసుకున్నాడు దర్శకుడు సుశీంద్రన్. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ నటించనుంది. ప్రస్తుతం నక్షత్రం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్, ఆ సినిమా పూర్తయిన తరువాత నా పేరు శివ సీక్వల్లో నటించనున్నాడు. హీరో హీరోయిన్లు ఇద్దరినీ మార్చి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నా పేరు శివకు సీక్వల్ అని దర్శకుడు ఎలా జస్టిఫై చేస్తాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement