ఎప్పుడూ గ్లామరస్‌గా ఉండలేం

Sameera Reddy reveals she was 102 kg after first pregnancy - Sakshi

‘‘సినిమా స్టార్స్‌ చాలా స్పెషల్‌. వారి లైఫ్‌స్టైల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటుంటారు. అలా ఉండటానికి మాకు (యాక్టర్స్‌కు) చాలా ప్రెషర్‌ ఉంటుంది. యాక్టర్‌గా నేను కూడా స్పెషల్‌గా ఉండటానికే ప్రయత్నించాను. కానీ ప్రెగ్నెన్సీ నా ఆలోచనా ధోరణిని మార్చేసింది’’ అంటున్నారు సమీరా రెడ్డి. 2014లో బిజినెస్‌మేన్‌ అక్షయ్‌ వార్దేను వివాహం చేసుకుని సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారామె. 2015లో ఓ బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం రెండోసారి ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. యాక్టర్‌ నుంచి మదర్‌గా మారడం, ప్రెగ్నెన్సీ గురించి సమీర మాట్లాడుతూ – ‘‘పెళ్లి అయిన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్‌ అయ్యాను.

డెలివరీ అయ్యాక సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాను.  కానీ  వ్యతిరేకంగా జరిగింది. గర్భవతిగా కొన్ని నెలలు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. అవార్డ్‌ ఫంక్షన్స్, గ్లామర్‌ లైఫ్‌ స్టైల్‌ని సునాయాసంగా హ్యాండిల్‌ చేసిన మనం ఈ ప్రెగ్నెన్సీ హ్యాండిల్‌ చేయలేకపోతున్నామా? అనే ఆలోచనలతో మానసికంగా కుంగిపోయాను. డెలివరీ అయ్యాక 102 కిలోల బరువున్నాను. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. ఆ టైమ్‌లో బయటకు వస్తే ‘సమీరా అలా మారిపోయిందేంటి?’ అనే మాటలకు బాగా డిస్ట్రబ్‌ అయిపోయాను. థెరపీ ద్వారా నార్మల్‌ అవ్వగలిగాను. ప్రతీసారి గ్లామరస్‌గా ఉండలేమని తెలుసుకున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top