క్యాబ్‌ డ్రైవర్‌గా సమంత! | Samantha Will Play A Cab Driver Role In Shiva Nirvana Film | Sakshi
Sakshi News home page

Jul 10 2018 1:04 PM | Updated on Aug 14 2018 3:14 PM

Samantha Will Play A Cab Driver Role In Shiva Nirvana Film - Sakshi

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెళ్లైతే హీరోయిన్‌ కెరీర్ ముగిసినట్టే అని భావిస్తారు. కానీ స్టార్‌ హీరోయిన్‌ సమంత మాత్రం పెళ్లి తరువాత కూడా వరు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పెళ్లి తరువాత రంగస్థలం, అభిమన్యుడు లాంటి సినిమాలతో సూపర్ హిట్స్‌ అందుకున్న సమంత త్వరలో డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్న యు టర్న్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే భర్త నాగచైతన్యతో కలిసి ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత క్యాబ్‌ డ్రైవర్‌ గా కనిపించనున్నారట. పెళ్లి తరువాత చైతూ, సమంతలు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్‌ అయ్యింది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్వకుడు.

Advertisement
 
Advertisement
Advertisement