ఆనందపడాలా? బాధపడాలా? | Samantha Ruth Prabhu's emotional message on Ye Maaya Chesave | Sakshi
Sakshi News home page

ఆనందపడాలా? బాధపడాలా?

Dec 26 2017 12:34 AM | Updated on Dec 26 2017 10:45 AM

Samantha Ruth Prabhu's emotional message on Ye Maaya Chesave - Sakshi

‘ఏ మాయ చేసావె’ చిత్రంతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్‌ సమంత. ఆ చిత్రంలో చేసిన ‘జెస్సీ’ పాత్రతో చెరగని ముద్ర వేశారీ బ్యూటీ. ఆ తర్వాత ‘దూకుడు, ఈగ, మనం, అఆ, జనతా గ్యారేజ్, అదిరింది’ వంటి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారామె. అందుకే తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. కానీ ఓ విషయంలో మాత్రం సమంతకు ఆనందపడాలో, బాధపడాలో అర్థం కాక అయోమయస్థితిలో ఉంటున్నారట. ఆ విషయం ఏంటంటే... ఇప్పటికీ సమంత దగ్గర ‘ఏ మాయ చేసావె’ సినిమా గురించే చాలామంది ప్రస్తావిస్తున్నారట. ‘‘ఎన్నో సినిమాలు చేశాను. ఎందుకు ఆ సినిమా గురించే పదే పదే మాట్లాడుతున్నారు. ఆ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్‌. కాదనను. కానీ ఆ తర్వాత నేను ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను.

వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే.. ‘ఏ మాయ చేసావె’ తర్వాత నేను అంత బాగా యాక్ట్‌ చేయలేదా? అని సమంత దిగాలు పడుతున్నారట. సోషల్‌ మీడియాలో రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో జరిగిన ఓ ఇంట్రాక్షన్‌లో ఓ ఫ్యాన్‌ ‘ఏ మాయ చేసావె’ గురించి అడిగినప్పుడు.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే, ఏడేళ్ల క్రితం చేసిన సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే ఓవైపు ఆనందంగానే ఉందని కూడా అంటున్నారామె. 

ఈ సంగతి ఇలా ఉంచితే... వచ్చే ఏడాది మొదటి మూడు నెలలు ముగిసేలోపు సమంత మూడు సార్లు థియేటర్స్‌లో సందడి చేయనున్నారు. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబుదరై’ జనవరి 26న, కీలకపాత్ర చేసిన తెలుగు ‘మహానటి’ మార్చి 29న, హీరోయిన్‌గా చేసిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదల కానున్నాయి. మూడు నెలలు ముగిసేలోపు సమంతను మూడుసార్లు సిల్వర్‌స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement