మిస్టరీ థ్రిల్లర్‌ | Samantha review on Subrahmanyapuram Teaser | Sakshi
Sakshi News home page

మిస్టరీ థ్రిల్లర్‌

Oct 21 2018 1:15 AM | Updated on Oct 21 2018 1:15 AM

Samantha review on Subrahmanyapuram Teaser - Sakshi

సుమంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. హీరోగా సుమంత్‌కి ఇది 25వ చిత్రం. సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడు. విజయదశమి కానుకగా సోషల్‌ మీడియాలో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయగా 24 గంటల్లో పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఈ సందర్భంగా సుమంత్‌ మాట్లాడుతూ– ‘‘భక్తి ప్రధాన ఇతివృత్తంగా సాగే మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రమిది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది.

నా సినిమా ప్రయాణంలో ఇదో మైలురాయిలా నిలుస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. సుధాకర్‌ మాట్లాడుతూ– ‘‘సుమంత్‌ కెరీర్‌లో 25వ సినిమా కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సినిమాను నిర్మిస్తున్నాం. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించటం విశేషం. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement