
‘లక్షలు లక్షలు సంపాదిస్తావ్... కానీ మందు తాగవ్... ఇంకెందుకు రా నీ బతుకు’ (నటుడు సత్య), ‘తాగుడికి సంపాదనకి లింకేముంది సార్’ (నరేశ్) అనే డైలాగ్స్‌తో ‘ఆల్కహాల్’ మూవీ టీజర్ ఆరంభమైంది. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, రుహానీ శర్మ, నిహారిక ఎన్.ఎం. హీరోయిన్లుగా రూ పొందుతోన్న చిత్రం ‘ఆల్కహాల్’. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేశ్ కాకుమాను, కిరీటి ఇతరపాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు. ‘‘ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామాగా రూ పొందుతోన్న చిత్రం ‘ఆల్కహాల్’.
హీరో జీవితాన్ని మద్యం ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం, తాగడానికి ముందు, తాగిన తర్వాత అతని ప్రవర్తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారంతో ఈ సినిమా రూ పొందుతోంది. మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు నరేశ్. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, కెమెరా: జిజు సన్నీ.