ప్రేమంటే కోటి ఆశలు | Sakshi
Sakshi News home page

ప్రేమంటే కోటి ఆశలు

Published Sat, Jul 5 2014 11:34 PM

ప్రేమంటే కోటి ఆశలు - Sakshi

‘‘ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మహేంద్ర నా కుటుంబ సభ్యుని లాంటివారు. అడపాదడపా నా కోపానికి గురి అవుతుంటారాయన (నవ్వుతూ). తెరపై ఆయన పేరు చూసి ఆనందించాను. జె.బి పాటలు వింటుంటే డాన్స్ చేయాలనిపిస్తోంది’’ అని సమంత చెప్పారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవర్స్’. సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు నిర్మాతలు. మారుతి సమర్పకుడు.
 
 జె.బి.స్వరాలందించిన ఈ చిత్రం పాటలను సమంత చేతులమీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. మరో అతిథి వి.వి.వినాయక్ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ‘‘కోటి ఆశలు, ముక్కోటి ఆనందాలు... వెరసి ప్రేమ. సింపుల్‌గా ఇదే ఈ సినిమా కథ’’ అని నిర్మాతలు చెప్పారు. అతిథులుగా విచ్చేసిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు కె.ఎస్.రామారావు, ఎమ్మెస్ రాజు, బెల్లంకొండ సురేశ్ తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement