ఓ బేబీ షాకిచ్చింది!

Samantha Akkineni Hikes Her Remuneration After Oh Baby Success - Sakshi

నటి సమంత నటించిన తాజా చిత్రం ఓ బేబీ. ఇది లేడీ ఓరియంటెడ్‌ కథాంశంతో కూడిని చిత్రం. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. అంతే కాదు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా సమంతకు తొలి సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం ఇదే అవుతుంది. ఇంతకు ముందు యూటర్న్‌ చిత్రంలో అలాంటి పాత్రను పోషించినా, అది ఆశించినంతగా సక్సెస్‌ కాలేదు. మొత్తం మీది నయనతార, అనుష్కల మాదిరి సమంత కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల పట్టికలో చేరిపోయారు.

అదేవిధంగా అంతకుముందు తన భర్త నాగచైతన్యతో నటించిన మజిలి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇంతకంటే మంచి తరుణం రాదనో ఏమో! పారితోషికాన్ని అమాంతం పెంచేశారట. బాలీవుడ్‌ను పక్కన పెడితే ఇప్పటి వరకూ దక్షిణాదిలో అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న నటిగా నయనతార నిలిచారు. ఈ అమ్మడు చిత్రానికి అక్షరాలా రూ.5 కోట్లు పుచ్చుకుంటున్నారని సమాచారం.

తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా దర్బార్, విజయ్‌ సరసన బిగిల్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ తరువాత అధిక పారితోషికం తీసుకుంటున్న లిస్ట్‌లో నటి అనుష్క నిలిచారు. ఈ బ్యూటీ రూ.4 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌. ఆ తరువాత కాజల్‌అగర్వాల్, సమంత, తమన్నా వంటి తారలు పారితోషికం అందుకుంటున్నారు.

కాగా నటి సమంత ఇప్పటి వరకూ రూ.2 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటోందని, దాన్ని ఓ బేబీ హిట్‌ తరువాత ఏకంగా రూ.3 కోట్లకు పెంచేసిందని సినీ వర్గాల్లో టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఓ బేబీ చిత్రం భారత దేశంలోనే కాకుండా అమెరికా వంటి ఇతర దేశాల్లోనూ కలక్షన్ల మోత మోగిస్తోందట. సాధారణంగా ఒక చిత్రం హిట్‌ అయితేనే పారితోషికం పెంచేస్తున్న ఈ రోజుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న సమంత పారితోషికం పెంచడంలో ఆశ్చర్యం ఉండదనుకుంటా.

అయితే పెళ్లి తరువాత హీరోయిన్‌గా కొనసాగడం ఒక ఎత్తు అయితే, సక్సెస్‌లు వరించడం మరో ఎత్తు. ఎందుకంటే నయనతార, కాజల్‌అగర్వాల్‌ వంటి తారలే వివాహం అయితే మార్కెట్‌ తగ్గిపోతుందనే భయంతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. సమంత మాత్రం ధైర్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని కథానాయికిగా, అదీ హీరోయిన్‌ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. తన మార్కెట్‌కు ఎలాంటి డోకా లేకపోవడంతో పారితోషికాన్ని పెంచేసి నిర్మాతలకు అలా షాక్‌ ఇచ్చారు ఓ బేబీ. ప్రస్తుతం ఈ భామ 96 రీమేక్‌గా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top