సల్మాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం | Salman Khan's bail plea hearing begins in Bombay High Court | Sakshi
Sakshi News home page

సల్మాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం

May 8 2015 11:29 AM | Updated on Sep 3 2017 1:40 AM

ముంబై హైకోర్టులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ ప్రారంభమైంది.

ముంబై: ముంబై హైకోర్టులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ ప్రారంభమైంది. సల్మాన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపిస్తున్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అల్వీరా కోర్టుకు చేరుకున్నారు. సల్మాన్ ఖాన్కు బెయిల్ మంజూరవుతుందా? లేక జైలుకెళ్లాలా అన్న విషయం ఈ రోజు తేలనుంది. సల్మాన్కు బెయిల్ లభించకుంటే.. ఇదే రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

హిట్ అండ్ రన్ కేసులో రెండ్రోజుల క్రితం సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement