సూపర్‌హిట్ సిరీస్‌లలో సూపర్ విలన్? | Salman Khan to Play a Villain in Dhoom 4? | Sakshi
Sakshi News home page

సూపర్‌హిట్ సిరీస్‌లలో సూపర్ విలన్?

Apr 21 2016 10:48 PM | Updated on Apr 3 2019 4:37 PM

సూపర్‌హిట్ సిరీస్‌లలో సూపర్ విలన్? - Sakshi

సూపర్‌హిట్ సిరీస్‌లలో సూపర్ విలన్?

సినిమాల్లో విలన్ల తుక్కురేగ్గొట్టడంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ స్టయిలే సెపరేటు. ఇప్పటివరకూ ఆయన కెరీర్లో

 సినిమాల్లో విలన్ల తుక్కురేగ్గొట్టడంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ స్టయిలే సెపరేటు. ఇప్పటివరకూ ఆయన కెరీర్లో అన్ని సినిమాల్లోనూ హీరోగానే కనిపించి అలరించారు. మరి సల్లూభాయ్ విలన్‌గా కనిపిస్తే ఎలా ఉంటుంది? అదీ ‘ధూమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో అయితే? అభిమానులకు పండగే పండగ. ఎందుకంటే, ‘ధూమ్’లో విలన్ అంటే హీరో కిందే లెక్క.
 
  వాళ్లు చేసే పోరాటాలన్నీ స్టయిలిష్‌గా ఉంటాయి. అందుకే ఆమిర్‌ఖాన్ కూడా ఈ సినిమాతోనే విలన్ అయ్యారు. ఇప్పుడు సల్మాన్ కూడా ఈ ‘ధూమ్’ నాలుగో భాగంలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. విశేషమేమిటంటే, ‘రేస్-3’లో కూడా విలన్‌గా నటించే ఛాన్స్ ఉందట. ‘రేస్’ రెండు భాగాల్లోనూ విలన్ పాత్రకు బోల్డెన్ని ట్విస్టులుంటాయి.
 
 చెప్పాలంటే హీరో పాత్రకు దీటుగా ఉంటుంది. ఇప్పుడీ రెండు సూపర్‌హిట్  సిరీస్‌లలో ప్రతినాయకుడిగా సల్మాన్ కనిపించ నునన్నారని సమాచారం. ఇప్పటికే ‘ధూమ్’ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్‌తో చర్చలు జరుపుతున్నారట. ఈ సినిమాకు వచ్చే లాభాల్లో తనకూ భాగం వచ్చేలా ప్లాన్ చేసుకుంటు న్నారు. బాలీవుడ్ ఖాన్‌త్రయంలో ఇప్పటి దాకా పూర్తిస్థాయి విలన్‌గా నటించని సల్మాన్‌ఖాన్ అంతా ఓ.కె. అయితే, ఈసారి పూర్తి విలన్‌గా అలరిస్తారేమో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement