ఫ్రెండ్ సినిమాలో హీరో స్పెషల్ సాంగ్ | Salman Khan to do an item song in Ajay Devgn's 'Shivaay'? | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్ సినిమాలో హీరో స్పెషల్ సాంగ్

Aug 2 2016 4:46 PM | Updated on Sep 4 2017 7:30 AM

ఫ్రెండ్ సినిమాలో  హీరో స్పెషల్ సాంగ్

ఫ్రెండ్ సినిమాలో హీరో స్పెషల్ సాంగ్

స్టార్ హీరోయిన్లు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం ఈ మధ్య కాలంలో అడపాదడపా చూస్తూనే ఉన్నాం.

స్టార్ హీరోయిన్లు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం ఈ మధ్య కాలంలో అడపాదడపా చూస్తూనే ఉన్నాం. అయితే స్టార్ హీరోలు అలాంటి ప్రత్యేక గీతాల్లో కనిపించడం విశేషం. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ స్పెషల్ సాంగ్లో చిందేయనున్నాడట. స్నేహితుడు అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్‌' లో సల్లూభాయ్ ప్రత్యేక పాటలో కనిపించనున్నారని టాక్. అజయ్, సల్మాన్ ల మధ్య ఎప్పటి నుంచో మంచి దోస్తీ ఉంది. పలు సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు.

ఇదివరకే అజయ్ సినిమా 'సన్ ఆఫ్ సర్దార్'లో ఓ స్పెషల్ సాంగ్కు అజయ్తో కలిసి కాలు కదిపాడు సల్మాన్. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతోపాటు ఫ్యాన్స్ను మెప్పించింది కూడా. అలానే ఇప్పుడు 'శివాయ్'లో సల్మాన్  స్పెషల్ డ్యాన్స్ నంబర్లో కనిపిస్తారనేది బీ టౌన్ న్యూస్. 'అఖిల్' ఫేమ్ సాయేషా సెహగల్ శివాయ్తో బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement