మరో సినిమాతో వస్తా! | Salman Khan new movie Inshallah postponed | Sakshi
Sakshi News home page

మరో సినిమాతో వస్తా!

Aug 27 2019 1:24 AM | Updated on Aug 27 2019 1:24 AM

Salman Khan new movie Inshallah postponed - Sakshi

సల్మాన్‌ ఖాన్‌

సల్మాన్‌ ఖాన్‌ నటించనున్న ‘ఇన్‌షా అల్లా’ చిత్రం విడుదల వాయిదా పడింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘ఇన్‌షా అల్లా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమాను ఆలస్యంగా విడుదల చేయనున్నారు.

‘‘ఇన్‌షా అల్లా’ చిత్రం వాయిదా పడింది. కానీ వచ్చే ఏడాది రంజాన్‌కు నేను మరో సినిమాతో మీ (ప్రేక్షకులు) ముందుకు వస్తాను’’ అన్నారు సల్మాన్‌. ఇదిలా ఉంటే సల్మాన్‌ ఖాన్‌ తాజాగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. దీంతో వచ్చే ఏడాది రంజాన్‌కు సల్మాన్‌ ఏ సినిమాతో ప్రేక్షకల ముందుకు వస్తారా? అనే చర్చ ప్రస్తుతం హాట్‌టాపిక్‌. పదేళ్లలో ఒక్క 2013లో తప్ప ప్రతి రంజాన్‌కి సల్మాన్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రెడీగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement