జోద్పూర్ కోర్టు తీర్పు : సల్మాన్ ఖాన్ నిర్దోషి | Salman Khan acquitted in Arms Act case | Sakshi
Sakshi News home page

జోద్పూర్ కోర్టు తీర్పు : సల్మాన్ ఖాన్ నిర్దోషి

Jan 18 2017 11:58 AM | Updated on Jul 26 2019 5:49 PM

జోద్పూర్ కోర్టు తీర్పు : సల్మాన్ ఖాన్ నిర్దోషి - Sakshi

జోద్పూర్ కోర్టు తీర్పు : సల్మాన్ ఖాన్ నిర్దోషి

లైసెన్స్ గడువు ముగిసిన తరువాత ఆయుధాలు కలిగి ఉండటం, వినియోగించడంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. దాదాపు 18 సంవత్సరాలుగా

జోద్పూర్ : లైసెన్స్ గడువు ముగిసిన తరువాత ఆయుధాలు కలిగి ఉండటం, వినియోగించడంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. దాదాపు 18 సంవత్సరాలుగా సల్మాన్ వెంటాడుతున్న ఆయుధాల కేసు నుంచి విముక్తి లభించింది. 1998 అక్టోబర్లో జోద్పూర్లో అనుమతి లేకుండా ఆయుధాలను వినియోగించటంతో పాటు వన్యప్రాణులను వేటాడినందుకు సల్మాన్పై నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటికే రెండు కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా నిరూపణ కాగా తాజాగా ఆయుధాల కేసు నుంచి కూడా సల్మాన్కు విముక్తి లభించింది. బుధవారం ఈ కేసులో తుది తీర్పు వెల్లడించిన జోద్పూర్ జిల్లా కోర్టు సల్మాన్ను నిర్దోషి అంటూ తీర్పు వెల్లడించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సల్మాన్ పై నమోదైన అభియోగాలను తోసిపుచ్చిన కోర్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement