డిజిటల్‌ ఎంట్రీ | Sai Pallavi and Prakash Raj in Vetrimaaran next | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ ఎంట్రీ

Nov 16 2019 2:48 AM | Updated on Nov 16 2019 2:48 AM

Sai Pallavi and Prakash Raj in Vetrimaaran next - Sakshi

సాయి పల్లవి

‘లస్ట్‌స్టోరీస్‌’ ఆంథాలజీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌. అదే ‘లస్ట్‌స్టోరీస్‌’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. తాజాగా కోలీవుడ్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ ఆంథాలజీతో అడుగుపెట్టనుంది. నలుగురు దర్శకులు నాలుగు కథలను కలిపి ఓ చిత్రంగా మలచడమే ఆంథాలజీ. ఈ తమిళ ఆంథాలజీ పరువు హత్యలు ఆధారంగా ఉంటాయని తెలిసింది.

తమిâ¶  దర్శకులు గౌతమ్‌ మీనన్, సుధా కొంగర, విఘ్నేశ్‌ శివన్, వెట్రిమారన్‌ ఈ ఆంథాలజీను తెరకెక్కిస్తారట. వెట్రిమారన్‌ రూపొందించే భాగంలో సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. కాగా సాయి పల్లవికి తొలి డిజిటల్‌ ఎంట్రీ ఇదే కానుంది. సాయిపల్లవి, ప్రకాశ్‌ రాజ్‌ తండ్రీకూతుళ్లుగా నటించనున్న ఈ ఆంథాలజీ డిసెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేశ్‌ శివన్‌ తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement