విన్నర్‌గా మెగా హీరో

విన్నర్‌గా మెగా హీరో


వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. శనివారం సాయిధరమ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. స్టైలిష్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో సినిమా టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే విన్నర్ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి గత చిత్రం తిక్క ఆకట్టుకోలేకపోవటంతో ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. టైటిల్ డిజైన్ చూస్తే సినిమా హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుందనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి ధమర్ తేజ్ ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ రెండింటిలో ఏది నిజం అన్న విషయం తెలియాలంటే టీజర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top