వేశ్యల జీవితాలపై టార్చ్‌లైట్‌

Sadha Joins Abdul Majith's 'Torchlight'

చూస్తున్నాం బాస్‌... ప్రతి సుఖానికీ ఓ రేటుందీ లోకంలో. కోరుకున్న సుఖం కోసం కావల్సినంత రేటు పెట్టి కొనేస్తున్నారీ లోకంలో కొందరు మగాళ్లు! పడక సుఖంతో సహా! మరి... డబ్బులకు మానాన్ని అమ్ముకుంటూ ఎవరో ఊరు పేరు తెలియనివాళ్లకు పడక సుఖాన్ని అందిస్తున్న స్త్రీలందరూ ఇష్టంగానే ఆ పని చేస్తున్నారా? అనే కథతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘టార్చ్‌లైట్‌’.

అబ్దుల్‌ మజిత్‌ దర్శకుడు. ఇందులో అర్ధరాత్రి హైవేల పక్కన నిలబడి విటుల కోసం వేచి చూసే వేశ్యగా ‘జయం’ ఫేమ్‌ సదా నటిస్తున్నారు. తెలుగులో ‘జయం, దొంగ దొంగది, చుక్కల్లో చంద్రుడు’ తదితర చిత్రాల్లో నటించిన సదా, ఎప్పుడూ హోమ్లీ క్యారెక్టర్స్‌లోనే కనిపించారు. రియాలిటీ డ్యాన్స్‌ షో జడ్జ్‌గా వ్యవహరించిన సమయంలోనూ అందాల ప్రదర్శన విషయంలో ఎక్కడా హద్దు దాటలేదు.

అటువంటిది ఒక్కసారిగా వేశ్య పాత్రలో సదా అనేసరికి ఆమె ఎలా నటించారోననే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. యాక్చువల్లీ... దర్శకుడు అబ్దుల్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ సదా కాదు. పలువురు కథానాయికల్ని ఆయన సంప్రదించగా... వేశ్యగా నటించడానికి నిరాకరించారట! ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయడానికి ఇష్టపడే సదా, కథ విన్న వెంటనే అంగీకరించారని అబ్దుల్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top