మీతో సెట్‌ కాదులే సామి! | Saamy 2 is left thrisha | Sakshi
Sakshi News home page

మీతో సెట్‌ కాదులే సామి!

Oct 24 2017 12:51 AM | Updated on Oct 24 2017 3:31 AM

 Saamy 2 is left thrisha

ఏంటి సామి... పబ్లిగ్గా త్రిష అంత మాట అనేశారు? మీతో సెట్‌ కాదంటూ వాళ్లకు ఎంత స్ట్రయిట్‌గా చెప్పేశారో? చెన్నై కోడంబాక్కమ్‌లో ఎక్కడ చూసినా ఇప్పుడిదే గుసగుస! అసలేం జరిగింది? అంటే... త్రిషకు నచ్చలేదు. ‘సామి–2’ టీమ్‌ క్రియేటివిటీ త్రిషకు అస్సలు నచ్చలేదు. దాంతో ‘కష్టమండీ! మీతో నాకు సెట్‌ కాదులెండి. నేను ఈ సినిమాలో నటించలేను’ అని ‘సామి–2’ టీమ్‌తో చెప్పారట. అంతేనా... ‘‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్వీటారు.

అదీ సంగతి! తెర వెనుక వినిపిస్తోన్న గుసగుస ఏంటంటే... విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిషే హీరోయిన్‌. ఇప్పుడా సిన్మాకి సీక్వెల్‌గా ‘సామి–2’ రూపొందుతోంది. ఈ సీక్వెల్‌లో త్రిషతో పాటు కీర్తీ సురేశ్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సామి–2’లో త్రిష కంటే కీర్తీ సురేశ్‌ రోల్‌ లెంగ్త్‌ ఎక్కువట! దాంతో త్రిషకు కోపం వచ్చి, సినిమా నుంచి తప్పుకున్నారట! ఆ సంగతి బయటకు చెప్పకుండా, ‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌’ అని త్రిష అంటున్నారని చెన్నై ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అంటే ఇదేనేమో!! అన్నట్టు... ఈ సామెత పేరుతో వచ్చిన వెంకటేశ్‌ సినిమాలో హీరోయిన్‌ త్రిషాయే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement