రుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదల | rudramadevi theatrical trailer released | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదల

Mar 2 2015 6:13 PM | Updated on Sep 2 2017 10:11 PM

రుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదల

రుద్రమదేవి థియేటర్ ట్రైలర్ విడుదల

దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రుద్రమదేవి సినిమా థియేటర్ ట్రయలర్ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు.

దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రుద్రమదేవి సినిమా థియేటర్ ట్రయలర్ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రయలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రుద్రమదేవి పోస్టర్లను విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. దాంతో సినిమా మీద అంచనాలు కూడా బాగా పెరిగాయి.

ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు సినిమాల్లో మొట్టమొదటి 3డి పౌరాణిక సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో ఇంకా రాణా, అల్లు అర్జున్, నిత్యామీనన్, కేథరిన్ తదితరులు నటిస్తున్నారు. రుద్రమదేవి సినిమా థియేట్రికల్ ట్రయలర్ను 2డిలో విడుదల చేసినట్లు సినిమా నిర్మాతలు తమ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement