పిల్లలకు నిక్‌నేమ్స్‌ పెట్టొద్దు: నటుడు

Rishi Kapoor Says Parents Must Never Nickname A Child - Sakshi

కొంతమందికి ముద్దుపేర్లంటే మహా సరదా. అయితే కొందరు నిక్‌నేమ్స్‌తో పిలిపించుకోవడం కన్నా ఎదుటివారిని ఆ పేర్లతో పిలవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. ఇక సినీ ప్రముఖులను అభిమానులు బోలెడు పేర్లతో పిలుచుకుంటారు. కొంతమంది అప్పటికే తమకున్న నిక్‌నేమ్స్‌ బయట పెట్టి వాటితోనే చలామణీ అవుతుంటారు. ఇంతకీ విషయమేంటంటే.. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రిషికపూర్‌కు ముద్దుపేర్లు అదే.. నిక్‌నేమ్స్‌ అంటే చెప్పలేనంత చిరాకట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో పంచుకున్నాడు. చింటూ అని రాసి ఉన్న టోపీ ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. చింటూ అనే పేరు నుంచి తిరిగి రిషికపూర్‌ అని పిలిపించుకోడానికి ఎంత కష్టపడ్డానో అంటూ రాసుకొచ్చాడు.

‘బాల్యంలో నా సోదరుడు రణధీర్‌ కపూర్‌ చింటూ అన్న పేరుతో నన్ను ఏడిపించేవాడు. అయితే తిరిగి నా పేరును సంపాదించుకోడానికి చాలా శ్రమించాను. ఎప్పటికైనా రిషికపూర్‌ పేరుతో పిలిపించుకోవాలని మనసులో బలంగా అనుకునేవాడిని’ అని రిషికపూర్‌ పేర్కొన్నాడు. అదే విధంగా తల్లిదండ్రులెవరూ పిల్లలకు నిక్‌నేమ్స్‌ పెట్టి మీ సృజనాత్మకతను చూపించుకోకండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. తన పిల్లలు రణబీర్‌ కపూర్‌, రిధిమా కపూర్‌లను యథాతథంగా పిలిచానే తప్పితే ఎలాంటి నిక్‌నేమ్స్‌ పెట్టలేదని పేర్కొన్నాడు. దీనికి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. నిజంగానే ‘రిషికపూర్‌’ అ‍న్న పేరు రావటానికి ఎంతగానో కష్టపడ్డారు అంటూ పొగడ్తలు కురిపించారు. సుమారు 11 నెలల తర్వాత రిషికపూర్‌ కేన్సర్‌ చికిత్స పూర్తి చేసుకొని ఈ మధ్యే న్యూయార్క్‌ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top