అతడిని పెళ్లి చేసుకో.. హీరోకి తండ్రి సలహా | Sakshi
Sakshi News home page

అతడిని పెళ్లి చేసుకో.. హీరోకి తండ్రి సలహా

Published Sun, Jul 1 2018 12:48 PM

Rishi Kapoor Joke On Ranbir Kapoor To Marry Best Friend - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్ ఉంటారు. ఈ క్రమంలో కుమారుడు, ‘సంజు’ ఫేమ్‌ రణ్‌బీర్‌ వివాహంపై చేసిన ట్వీట్‌ పేలింది. ఎందుకంటే ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని రణ్‌బీర్‌కు రిషి కపూర్‌ సలహా ఇవ్వడమే అందుకు కారణం. అబ్బాయిని పెళ్లి చేసుకోమని మీ నాన్నే నీకు సలహా ఇచ్చాడు చూడు అంటూ నెటిజన్లు రణ్‌బీర్‌ను తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

విషయం ఏంటంటే.. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రేమించుకుంటున్నారని, త్వరలో వీరిద్దరు పెళ్లి జరగనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటానని అలియా చెప్పగా.. రణ్‌బీర్‌ ఆ మాత్రం కూడా నోరు విప్పలేదు. కుమారుడి పెళ్లిపై వదంతులకు చెక్‌ పెట్టేందుకు.. ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌.. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది.. హై టైమ్‌’అని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ, రణ్‌బీర్‌ల ఫొటోను రిషికపూర్‌ పోస్ట్‌ చేశారు. అయాన్‌ ముఖర్జీ, రణ్‌బీర్‌లు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అన్న విషయం తెలిసిందే. కాగా, రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘సంజు’  విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement