బోర్ కొడుతోంది వర్మా.. | RGVzoomin u asked dis infinite times before n now we r bored | Sakshi
Sakshi News home page

బోర్ కొడుతోంది వర్మా..

Dec 30 2016 7:22 PM | Updated on Aug 25 2018 6:31 PM

బోర్ కొడుతోంది వర్మా.. - Sakshi

బోర్ కొడుతోంది వర్మా..

నీ ట్వీట్లతో బోర్‌ కొడుతోంది వర్మా అంటున్నారు నెటీజన్లు.

ముంబై: వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి అదే బాట పట్టాడు. హిందువులు భక్తితో పూజించే లక్ష్మీదేవిని టార్గెట్‌గా చేసుకొని వర్మ శుక్రవారం ట్వీట్ల వర్షం కురిపించాడు. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ఎప్పటిలాగే వర్మ చేసిన ట్వీట్లపై నెటీజన్లు తీవ్రంగా స్పందించారు.

'ఫైనాన్స్‌ గాడెస్‌ లక్ష్మీదేవి లేకుండానే అమెరికా మన కన్నా ఎలా సంపన్నదేశమైంది? వేల సంవత్సారాలుగా లక్ష్మీదేవిని పూజిస్తున్నా ఎక్కువశాతం ఇండియన్స్‌ ఎందుకు పేదవారిగా ఉన్నారు' అంటూ వర్మ చేసిన ట్వీట్లపై పలువురు నెటీజన్లు స్పందించారు. గతంలోనూ మీరు ఇలాంటి ట్వీట్స్‌ చేశారు మాకు బోర్‌ కొడుతోంది అంటూ కొందరు ట్వీట్‌ చేయగా.. మరికొందరు మాత్రం 'నువ్‌ అమెరికాలో లేవు కాబట్టే' అంటూ స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement