నాగ్‌ నాకు బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉందని జాతకం చెప్పారు | RGV and Nag Film Heroine Myra Sareen | Sakshi
Sakshi News home page

నాగ్‌ నాకు బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉందని జాతకం చెప్పారు

Feb 3 2018 12:23 AM | Updated on Jul 15 2019 9:21 PM

RGV and Nag Film Heroine Myra Sareen - Sakshi

లొకేషన్లో నాగ్, మైరా

నాగార్జునకి సూపర్‌ న్యాచురల్‌ పవర్స్‌ వచ్చాయండీ. చేయి చూసి భవిష్యత్తు చెప్పేస్తున్నారు. అదేంటి నాగార్జున ‘రాజుగారి గది 2’లో చేసిన రుద్రా పాత్ర గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఆ సినిమా గురించిన విషయం కాదు ఇది. ‘‘నాగార్జునగారు ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్‌ చేస్తున్నారు’’ అని అంటున్నారు మైరా సరీన్‌.

ఎవరీ మైరా సరీన్‌ అంటే నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు మైరా. ఈ చిత్రానికి ‘శపథం: మై రివెంజ్‌ కంప్లీట్‌’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌) అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘‘షూటింగ్‌ గ్యాప్‌లో సరదాగా నాగ్‌ సార్‌ నా చేతి రేఖలను చూసి, ‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నీకు చాలా బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంది’ అని జోస్యం చె‡ప్పారు’’ అని పేర్కొన్నారు మైరా సరీన్‌. ఈ బ్యూటీకి ఇది ఫస్ట్‌ మూవీ.
ఇంతకీ ఈ మైరా సరీన్‌ని రామ్‌గోపాల్‌ వర్మ ఎక్కడ చూశారు? ఎలా సెలెక్ట్‌ చేశారో తెలుసా? ‘‘మైరాను నేనో పార్టీలో చూసి, నీకు యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ ఉందా? అని అడిగాను. ఆ తర్వాత ఆడిషన్‌లో తన నాచ్యురల్‌ పెర్ఫార్మెన్స్‌ చూసి షాక్‌ అయ్యాను. తను చాలా ఎక్స్‌ప్రెసివ్‌’’ అన్నారు వర్మ. మరి నాగార్జున జోస్యం  చెప్పినట్టుగా, వర్మ షాక్‌ అయినట్టుగా మైరా సరీన్‌ ఆడియన్స్‌ను కూడా ఇంప్రెస్‌ చేస్తారో లేదో చూడాలి. కంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్ర– రామ్‌ గోపాల్‌ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను  సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

                                   మైరా సరీన్‌

Advertisement
 
Advertisement
Advertisement