జూలై 8న 'రెండు రెళ్ళు ఆరు' | rendu Rellu aaru releasing on july 8th | Sakshi
Sakshi News home page

జూలై 8న 'రెండు రెళ్ళు ఆరు'

Jun 29 2017 5:04 PM | Updated on Sep 5 2017 2:46 PM

జూలై 8న 'రెండు రెళ్ళు ఆరు'

జూలై 8న 'రెండు రెళ్ళు ఆరు'

అనిల్‌ మల్లెల, మహిమా హీరోహీరోయిన్లుగా నందు మల్లెల దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం

అనిల్‌ మల్లెల, మహిమా హీరోహీరోయిన్లుగా నందు మల్లెల దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ బ్యానర్స్‌ పతాకంపై ప్రదీప్‌చంద్ర, మోహన్‌ అండె సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'. విజరు బుల్‌గానిన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఇటీవల ప్రముఖ దర్శకులు రాజమౌళి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'చిన్న సినిమాగా ప్రారంభమైన మా 'రెండు రెళ్ళు ఆరు' వారాహి సాయిగారి వల్ల పెద్ద సినిమాగా మారింది. రాజమౌళిగారు ఆడియో విడుదల వేడుకకు విచ్చేసి ఆశీర్వదించడంతో మా సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యి క్లీన్ 'యు' సర్టిఫికెట్ సంపాదించుకొంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగ్గ చిత్రంగా మా డైరెక్టర్ నందు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement