పది లైన్స్‌లో ఈ కథ చెప్పారు... బాగుంది | Rendu rella aaru The movie songs and theatrical trailer released today | Sakshi
Sakshi News home page

పది లైన్స్‌లో ఈ కథ చెప్పారు... బాగుంది

Jun 21 2017 12:10 AM | Updated on Sep 5 2017 2:04 PM

పది లైన్స్‌లో ఈ కథ చెప్పారు... బాగుంది

పది లైన్స్‌లో ఈ కథ చెప్పారు... బాగుంది

‘‘కథ వినగానే బాగా జడ్జ్‌ చేసే టాలెంట్‌ సాయిగారికి ఉంది. ‘ఈగ’ చిత్రాన్ని చిన్న సినిమాగా తీద్దామని అంటే, ‘ఇది పెద్ద మాస్‌ సినిమా సార్‌.. పెద్దగా తీద్దాం’ అని నన్నెంతో ప్రోత్సహించారు

– రాజమౌళి
‘‘కథ వినగానే బాగా జడ్జ్‌ చేసే టాలెంట్‌ సాయిగారికి ఉంది. ‘ఈగ’ చిత్రాన్ని చిన్న సినిమాగా తీద్దామని అంటే, ‘ఇది పెద్ద మాస్‌ సినిమా సార్‌.. పెద్దగా తీద్దాం’ అని నన్నెంతో ప్రోత్సహించారు. ప్రేక్షకుల నాడి పట్టుకోగల మంచి అభిరుచి ఉన్న నిర్మాత ఆయన’’ అని దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. అనీల్‌ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో సాయికొర్రపాటి సమర్పణలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెండు రెళ్ళు అరు’.

వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ పతాకాలపై  ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అండె నిర్మిస్తున్నారు. విజయ్‌ బుల్‌గానిన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రాజమౌళి, థియేట్రికల్‌ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి విడుదల చేశారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘సాయి పది లైన్స్‌లో ‘రెండు రెళ్ళు ఆరు’ కథ నాకు వినిపించారు. ఓపెనింగ్‌ సీన్‌ చాలా బావుందనిపించింది. ఇప్పుడున్న ఎంటర్‌టైన్మెంట్స్‌ను దాటి ప్రేక్షకులు సినిమాకు రావాలంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే.

అలాంటి ఇంట్రెస్టింగ్, హార్ట్‌ టచింగ్, హ్యూమర్‌ ఉన్న సినిమా ఇది. ట్రైలర్, సాంగ్స్‌ బాగున్నాయి’’ అన్నారు. ‘‘మా టీమ్‌ కన్న కలలకు నిర్మాతలు ప్రదీప్, మోహన్‌గారు రూపమిస్తే, సాయికొర్రపాటిగారు ప్రాణం పోశారు’’ అన్నారు నందు మల్లెల. ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అండె, అనిల్‌ మల్లెల, మహిమా, విజయ్‌ బుల్‌గానిన్, నటులు సీనియర్‌ నరేశ్, అవసరాల శ్రీనివాస్, సంగీత దర్శకుడు డీజే వసంత్‌  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement