వారం ముందే స్పైడర్‌? | Record spots on 'Spider' Teaser YouTube | Sakshi
Sakshi News home page

వారం ముందే స్పైడర్‌?

Jun 7 2017 12:12 AM | Updated on Sep 5 2017 12:57 PM

వారం ముందే స్పైడర్‌?

వారం ముందే స్పైడర్‌?

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాక, హిందీ సినిమా మాత్రమే పరిచయమున్న ప్రేక్షకుడికి కూడా తెలిసిన పేరు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాక, హిందీ సినిమా మాత్రమే పరిచయమున్న ప్రేక్షకుడికి కూడా తెలిసిన పేరు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘స్పైడర్‌’ దసరా సీజన్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మధ్యే ఒక్కటంటే ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా ‘ష్‌...’ అంటూ వచ్చిన ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ రాబడుతోంది.

దీంతో ‘స్పైడర్‌’ పై బాలీవుడ్‌లో కూడా క్రేజ్‌ వచ్చేసింది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమాను ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ హిందీలో అనువదించి, విడుదల చేయాలనుకుంటోందట. రిలీజ్‌ను భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. ఇంకో విషయం ఏంటంటే... బాలీవుడ్‌ ప్రముఖులకు, మీడియా వారికీ రిలీజ్‌కు ఓ వారం ముందే స్పెషల్‌ షోస్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టీమ్‌ ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement