రికార్డుల వేట మొదలైంది... సాహో

Record Price For Prabhas Sahoo Satellite Rights - Sakshi

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రికార్డుల వేట మొదలు పెట్టింది. బాహుబలి సినిమాతో ఉత్తరిదిలో ప్రభాస్‌కు భారీ మార్కెట్‌ ఏర్పడింది. దీంతో సాహో సినిమా హక్కుల కోసం బాలీవుడ్ లో గట్టి పోటి నెలకొంది. అందుకు తగ్గట్టుగా సాహో హిందీ శాటిలైట్‌ హక్కులు 120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలో నటిస్తుండటంతో పాటు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్‌ ఇషాన్‌ లాయ్‌లు స్వరాలందించటం కూడా బాలీవుడ్ మార్కెట్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top