'మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు సిద్ధమే...' | Ready to act in multi starrer movie, says hero kalyanram | Sakshi
Sakshi News home page

'మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు సిద్ధమే...'

Jan 30 2015 6:51 PM | Updated on Sep 2 2017 8:32 PM

'మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు సిద్ధమే...'

'మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు సిద్ధమే...'

పటాస్ సినిమా సక్సెస్ను హీరో నందమూరి కళ్యాణ్రామ్ ఆస్వాదిస్తున్నారు.

పటాస్ సినిమా సక్సెస్ను హీరో నందమూరి కళ్యాణ్రామ్ ఆస్వాదిస్తున్నారు. తిరుపతి నగరంలోని ఓ థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని పటాస్ మూవీని కళ్యాణ్రామ్ శుక్రవారం నాడు చూశారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందని, ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కూడా తగ్గలేదని ఆయన అన్నారు.

'శనివారం నుంచి పటాస్ సినిమా విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటాను. మంచి కథ దొరికితే మల్టీస్టారర్ మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను' అని ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్రామ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement