breaking news
hero kalyanram
-
హీరో కల్యాణ్‌రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించి, హీరోగా నటించిన పటాస్ సినిమా టైటిల్లో జాతీయ చిహ్నాన్ని అవమానపరిచేలా చిహ్నం ఏర్పాటు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దిల్సుఖ్ నగర్‌కు చెందిన న్యాయ విద్యార్థి వై.శ్రీధర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పటాస్ టైటిల్లో టా అక్షరంపై అశోకచక్రం ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇదే అక్షరంపై అశోక చక్రం ముద్రించారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సాగర్ సొసైటీలో ఉన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమా కార్యాలయంపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందే నందమూరి కల్యాణ్‌రామ్‌కు లీగల్ నోటీసు పంపించినా ఆయన స్పందించలేదని అందులో వివరించారు. కాగా ఈ ఫిర్యాదుపై నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేయనున్నట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ తెలిపారు. -
'మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు సిద్ధమే...'
పటాస్ సినిమా సక్సెస్‌ను హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ఆస్వాదిస్తున్నారు. తిరుపతి నగరంలోని ఓ థియేటర్లో అభిమానుల మధ్య కూర్చుని పటాస్ మూవీని కళ్యాణ్‌రామ్ శుక్రవారం నాడు చూశారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందని, ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కూడా తగ్గలేదని ఆయన అన్నారు. 'శనివారం నుంచి పటాస్ సినిమా విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటాను. మంచి కథ దొరికితే మల్టీస్టారర్ మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను' అని ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ తెలిపారు.