'సాఫ్ట్ టార్గెట్ గా బాలీవుడ్ సెలబ్రిటీలు' | Reactions to Salman's tweets on Yakub were premature, says Riteish Deshmukh | Sakshi
Sakshi News home page

'సాఫ్ట్ టార్గెట్ గా బాలీవుడ్ సెలబ్రిటీలు'

Jul 31 2015 7:26 PM | Updated on Apr 3 2019 6:23 PM

'సాఫ్ట్ టార్గెట్ గా బాలీవుడ్ సెలబ్రిటీలు' - Sakshi

'సాఫ్ట్ టార్గెట్ గా బాలీవుడ్ సెలబ్రిటీలు'

యాకూబ్ మెమన్ కు మద్దతుగా హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్స్ ను అపార్థం చేసుకున్నారని నటుడు రితేశ్ దేశ్ ముఖ్ అన్నారు.

ముంబై: యాకూబ్ మెమన్ కు మద్దతుగా హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్స్ ను అపార్థం చేసుకున్నారని నటుడు రితేశ్ దేశ్ ముఖ్ అన్నారు. సల్మాన్ వ్యాఖ్యలను నెటిజన్లు సరిగా అర్థం చేసుకోలేదని అన్నాడు. యాకూబ్ మెమన్ అమాయకుడని, అతడి సోదరుడు టైగర్ మెమన్ చేసిన దానికి యాకూబ్ ను ఉరితీయం సరికాదని ఆదివారం సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సల్మాన్ తర్వాత క్షమాపణ చెప్పాడు.

సల్మాన్ ట్వీట్స్ ను అర్థం చేసుకోకుండానే చాలా మంది వ్యతిరేకంగా స్పందించారని రితేశ్ పేర్కొన్నాడు. తప్పొప్పుల చర్చ జరగకుండానే సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారని వాపోయాడు. చాలాసార్లు బాలీవుడ్ సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ గా చేసుకుంటున్నారని, దాంతో ప్రజామాధ్యమాల్లో తమ అభిప్రాయాలు వెల్లడించాలంటే వెనుకంజ వేయాల్సివస్తోందని అన్నాడు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని రితేశ్ స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement