‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’ | Rayalaseema Love Story Runs Into Controversy For Hurting Rayalaseema Sentiments | Sakshi
Sakshi News home page

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

Sep 26 2019 3:29 PM | Updated on Sep 26 2019 3:39 PM

Rayalaseema Love Story Runs Into Controversy For Hurting Rayalaseema Sentiments - Sakshi

ఇటీవల కాలంలో సినిమాల రిలీజ్‌ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా టైటిల్‌, పోస్టర్స్‌, కంటెంట్‌ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంత మంది వ్యక్తులు, సంఘాలు సినిమాల రిలీజ్‌లను అడ్డుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో చిత్ర నిర్మాతలు కూడా వివాదాల ద్వారానే సినిమాకు ప్రచారం పొందాలని భావిస్తున్నారు.

ఇటీవల చివరి నిమిషంలో వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాల్సి రావటం తెలిసిందే. తాజాగా మరో సినిమా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఎలాంటి ప్రమోషన్‌ లేకుండా రాయలసీమ లవ్‌ స్టోరి అనే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌, పోస్టర్‌ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాయలసీమ ప్రత్యేక హక్కుల పోరాట సమితి ఆందోళనకు దిగింది.

రాయలసీమ పేరు మీద అభ్యంతరకర దృశ్యాలతో అశ్లీల చిత్రం రూపొందించిన రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని వారు ఆరోపిస్తున్నారు. సినిమా టైటిల్‌ మార్చి దర్శక నిర్మాతలు రాయలసీమ ప్రజలను క్షమాపణ కోరాలని లేని పక్షంలో  రేపు రిలీజ్‌ కానున్న ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు చేశారు. రాయలసీమ లవ్‌స్టోరి సినిమా పోస్టర్లను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు.

వెంకట్‌, వృశాలి, పావని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు రమణధీర్‌ దర్శకుడు. పంచలింగాల బ్రదర్స్‌, నాగరాజు, రాయల్‌ చిన్నాలు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement