ఫ్లాప్ డైరెక్టర్లకు చాన్స్ ఇస్తున్నాడట..!

బెంగాళ్ టైగర్ సినిమాతో డిసెంట్ హిట్ సాధించిన మాస్ మహరాజ రవితేజ, ఆ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చక్రి అనే కొత్త దర్శకుడితో రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పాడు రవితేజ.
సర్దార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు బాబీతో సినిమా చేయడానికి అంగీకరించాడు మాస్ మహరాజ. తనకు పవర్ లాంటి హిట్ సినిమా అందించిన బాబీతో మరొక సారి కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు గతంలో రవితేజ హీరోగా వీర అనే డిజాస్టర్ను తెరకెక్కించిన రమేష్ వర్మకు కూడా రవితేజ మరో చాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి