‘అదుగో’ ఫస్ట్ లుక్

RaviBabu Adugo First Look - Sakshi

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో ఓ  పంది పిల్ల కీల‌క‌ పాత్రలో న‌టిస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో పిగ్ లెట్ బంటిని ప‌రిచ‌యం చేసారు ద‌ర్శక నిర్మాత‌లు. చెక్క కంచెకు వేలాడుతూ న‌వ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అంద‌ర్నీ అల‌రిస్తుంది. ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా అదుగో. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ద‌స‌రా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. సురేష్ ప్రొడ‌క్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.

తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్న పిల్లలను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.  తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం బంటి పేరుతో విడుద‌ల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top