‘దెయ్యాలున్నాయని నిరూపిస్తే 5కోట్లు’ | Rashmi Anthaku Minchi Movie Trailer Out | Sakshi
Sakshi News home page

‘అంతకు మించి’ ట్రైలర్‌ విడుదల

Jul 9 2018 8:07 PM | Updated on Jul 9 2018 9:08 PM

Rashmi Anthaku Minchi Movie Trailer Out - Sakshi

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ హీరోయిన్‌గా సక్సెస్‌ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. జబర్తస్త్‌లో ఫేమస్‌ కాకముందు నుంచే సిల్వర్‌ స్క్రిన్‌పై చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మి ‘గుంటూరు టాకీస్‌’ సినిమాలో నటించి మెప్పించారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపును తీసుకురాలేదు.

అయితే మళ్లీ రష్మి హీరోయిన్‌గా ‘అంతకు మించి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు (జూలై​ 9) విడుదల చేశారు. దెయ్యాలున్నాయని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తారన్న ప్రకటన చూసిన హీరో..  ఆ ప్రయత్నంలో ఉండగా హీరోయిన్‌తో పరిచయం.. నిజంగా దెయ్యాలున్నాయా? ఆ హీరోకు ఎదురైన పరిస్థితులు ఏంటి అన్న ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాకు జానీ​దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement