‘ఆమె నా అదృష్ట దేవత.. అందుకే పెళ్లి చేసుకున్నాను’ | Ranveer Singh Told Why He Chose Lake Como And Things About Deepika Padukone | Sakshi
Sakshi News home page

Nov 28 2018 8:33 PM | Updated on Nov 28 2018 8:44 PM

Ranveer Singh Told Why He Chose Lake Como And Things About Deepika Padukone - Sakshi

ఆరేళ్లు ప్రేమించాను.. అరవై ఏళ్లు తనతో కలిసి జీవించబోతున్నాను

ఆమె చాలా మంచిది.. చాలా ప్రేమాభిమానాలున్న మనిషి.. ‍ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌. ఐదేళ్లపాటు ప్రేమ పక్షులుగా విహరించిన ఈ బాలీవుడ్‌ మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌ నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. ఇటలీలోని లేక్‌ కోమోలో అంగరంగ వైభవంగా దీప్‌వీర్‌ల వివాహం జరిగింది. వివాహనంతరం సినీ, రాజకీయ ప్రముఖల కోసం బెంగళూరులో, ముంబైలో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు రణ్‌వీర్‌ సింగ్‌. ఈ సందర్భంగా తన భార్య దీపికను పొగడ్తలతో ముంచేత్తారు రణ్‌వీర్‌.

‘నేను తనతో ఆర్నెళ్లు డేటింగ్‌ చేశాను.. అనంతరం ఆరేళ్లు ప్రేమించాను.. ఇప్పుడు మరో అరవై ఏళ్ల జీవితం తనతో కలిసి జీవించబోతున్నాను. తను చాలా అందమైన, ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి. ఆమె చాలా ప్రత్యేకం.. ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం’ అన్నారు. మా పెళ్లి గురించి మూడేళ్ల నుంచే సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. కానీ ఆమె సమాధానం కోసం ఎదురు చూశానని తెలిపారు.

ఇకపోతే వివాహ వేదికగా ఇటలీనే ఎంచుకోవడం గురించి మాట్లాడుతూ.. ‘ఇది దీపిక కోరిక. వివాహం గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కళలు కంటుంది. అలానే దీపిక కూడా తన వివాహ వేదికగా ఇటలీని ఎంచుకుంది. తనకు కాబోయే భర్తగా ఆమె కలల్ని.. చిన్న చిన్న ఆశలను తీర్చడం నా బాధ్యత. తన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆమె సంతోషమే నా సంతోషం. ఎందుకంటే తను నా అదృష్ట దేవత’ అంటూ భార్య పట్ల తన ప్రేమను తెలియజేశారు రణ్‌వీర్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement