మా పెళ్లికి సెల్‌ఫోన్లు తేవొద్దు!

Ranveer Singh - Deepika Padukone Ban Cell Phones At Their Italy Wedding? - Sakshi

ముంబై : రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మల మాదిరి ఈ జంట కూడా ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతుంది. గతంలో నవంబర్‌ 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ప్రచారం జోరుగా సాగితే, తాజాగా వివాహ ముహుర్తం నవంబర్‌ 20న పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవబోతుంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించకూడదని దీపికా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. వివాహాన్ని ప్రైవేట్‌గా నిర్వహించాలని చూస్తోంది. 

రిపోర్టుల ప్రకారం కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే ఈ వేడుకలో భాగం కాబోతున్నారట. అంతేకాక వీరి వివాహ వేడుకకు సెల్‌ ఫోన్లు అనుమతించకూడదని కూడా ఈ జంట నిర్ణయించారట. వేడుక అనంతరం వీరిద్దరే వివాహ ఫోటోలను అందరికీ షేర్‌ చేయాలని ప్లాన్‌ చేశారట. మా పెళ్లికి సెల్‌ఫోన్లు తీసుకురావద్దంటూ అతిథులకు దీపికా-రణ్‌వీర్‌ చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని కూడా వీరు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నాయి. ఇది డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అని, కొంతమంది అతిథులను మాత్రమే పిలుస్తున్నారని, అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయంటూ సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ పెళ్లి చాలా పర్‌ఫెక్ట్‌గా చేసుకోవాలని రణ్‌వీర్‌, దీపికాలు నిర్ణయించారట. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top