అఫీషియల్‌: ఎన్టీఆర్‌లో రానా

Rana Officially Confirmed in Part of NTR - Sakshi

నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ ఆయన తనయుడు బాలకృష్ణ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్‌’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌ అందింది. యంగ్‌ హీరో రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్టులో భాగంగా కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించాడు. 

‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను’ అంటూ బాలయ్య, క్రిష్‌లతో ఓ సెల్ఫీ దిగి తన సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానా.. ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు నాయుడి పాత్రలోనే కనిపించబోతున్నాడంటూ బాలీవుడ్‌ ట్రేడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ఓ ట్వీట్‌ చేశారు. 

నందమూరి బాలకృష్ణతోపాటు విష్ణు వర్ధన్‌, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌ రాజ్‌, విద్యాబాలన్‌, సీనియర్‌ నటుడు నరేష్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఎన్టీఆర్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top