రఫ్‌లుక్‌లో రానా.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌!

 Rana Daggubati first look in Haathi Mere Saathi - Sakshi

వైవిధ్య‌భరితమైన పాత్రలు పోషిస్తూ వస్తున్న హీరో రానా ద‌గ్గుబాటి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రిభాషా చిత్రం ‘హథీ మేరీ సాథీ’లో బందేవ్‌గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 1971లో హిందీలో వచ్చిన బాలీవుడ్ క్లాసిక్ చిత్రం హథీ మేరీ సాథీ స్ఫూర్తిగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  అలనాటి నట దిగ్గజం రాజేశ్ ఖన్నా, తనూజ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘హథీ మేరీ సాథీ’ చిత్రం ప్రశంసలందుకుంది.

ఈ చిత్రం స్ఫూర్తితో నిజజీవిత ఘటనల ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు సోలొమాన్. ట్రినిటీ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ 2018 జనవరి నుంచి భారత్, థాయ్ లాండ్ లలో జరగనుంది. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గతంలో ఈ సినిమా టైటిల్ లోగోని వెల్లడించిన చిత్రయూనిట్ తాజాగా కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా ఫ‌స్ట్ లుక్‌ను విడుదల చేశారు. భారీ ఏనుగు ముందు రఫ్‌లుక్‌లో కనిపిస్తున్న రానా ఫస్ట్‌లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top