పౌరాణిక పాత్రలో రానా.. త‍్వరలో సెట్స్‌ మీదకు

Rana Daggubati - Sakshi

విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో ఆసక్తికరమైన చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్‌ జానర్‌ లో తెరకెక్కుతున్న 1945, హథీ మేరీ సాథీతో పాటు చారిత్రక చిత్రంగా రూపొందుతున్న మార్తాండ వర్మ సినిమాల్లో సినిమా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు గుణశేఖర్‌, త్వరలో హిరణ్య కశ్యప సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోసారి గుణ టీం వర్క్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి కథను హిరణ్యకశ్యపుడి కోణంలో చూపించనున్నారట. ఈ సినిమాలో హిరణ్య కశ్యపుడిగా రానా నటించనున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top