‘అమ్మ’ పాత్రకు భారీ రెమ్యూనరేషన్‌

Ramya Krishna In Jayalalitha Biopic - Sakshi

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటికే నిత్య మీనన్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్రకటించారు. సినిమాగానే కాక వెబ్‌ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు.

ఈ పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణ భారీగా రెమ్యూనరేషన్‌ అందుకోనున్నారట. బాహుబలి తరువాత రమ్యకృష్ణ రేంజ్‌ తారా స్థాయికి చేరింది. ఈ బయోపిక్‌ వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉండటంతో రమ్యకృష్ణ భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో జయలలిత సినీ నటిగా ఉన్న సమయంలో వచ్చే సన్నివేశాల్లో యువ కథానాయిక ఆ పాత్రలో కనిపించనున్నారు. మూడు సీజన్లుగా తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ్‌, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top