ఆయనది ఒదిగి ఉండే తత్వం: వైఎస్ జగన్ | Ramanaidu is down to earth, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఆయనది ఒదిగి ఉండే తత్వం: వైఎస్ జగన్

Feb 18 2015 4:16 PM | Updated on Jul 25 2018 4:09 PM

ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత డి.రామనాయుడు భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి నివాళులు అర్పించారు.

ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత డి.రామనాయుడు భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. రామనాయుడు మనమడు, సురేష్బాబు కుమారుడు అభిరాంకు  వైఎస్ జగన్ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సీనియర్ నిర్మాత రామానాయుడిదని వైఎస్ జగన్ అన్నారు. రామానాయుడు మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తెలుగు చిత్ర నిర్మాణ రంగంలోనే అగ్రగణ్యులని, మూవీ మొఘల్గా పేరు గడించారని చెప్పారు.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీతోపాటు వివిధ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాలను నిర్మించి ఎన్నో అవార్డులతోపాటు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తుచేశారు. మనసున్న మనిషిగా చిత్ర పరిశ్రమలో ఆయన అందరి అభిమానాలు చూరగొన్నారని, ఎందరికో మార్గదర్శకులయ్యారని చెప్పారు. రామానాయుడు మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధకు గురిచేసిందంటూ.. తన కుటుంబ సభ్యులపట్ల వైఎస్ జగన్ ప్రగాడ సానుభూతిని  తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement