‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’ | Ram Pothineni Pens Heartfelt Message for His Fans | Sakshi
Sakshi News home page

అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేసిన ఇస్మార్ట్‌ హీరో

May 16 2020 4:21 PM | Updated on May 16 2020 5:19 PM

Ram Pothineni Pens Heartfelt Message for His Fans - Sakshi

నిన్న హీరో రామ్‌ పోతినేని పుట్టిన రోజు. అభిమానులు, సహ నటులు సోషిల్‌ మీడియా వేదికగా రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ నేథ్యంలో అభిమానులు తన పుట్టిన రోజుకు వేడుకలకు దూరంగా ఉండాలంటూ రామ్‌ పిలుపునిచ్చారు. ఇక తమ అభిమాన హీరో పిలుపు మేరకు అభిమానులు బర్త్‌డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కానీ రామ్‌ పేరు మీద పూజలు, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తన మీద ఇంత అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కు రామ్‌ ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.(అదే మీరు నాకిచ్చే అసలైన కానుక : రామ్‌)

‘మీరో చాలా మంది తినకుండా, రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారని విన్నాను. మీరు నా మీద చూపిస్తోన్న ప్రేమకు గర్వంగా ఫీలవుతున్నాను. మీ లాంటి అభిమానలను కలిగి ఉండటం నిజంగా నా అదృష్టం. ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటూ రామ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’‌ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రామ్ ‌పుట్టిన రోజు సందర్భంగా ఈ‌ చిత్రంలోని  ‘డింఛక్‌’ అనే మాస్‌ సాంగ్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్‌ చేయగా సాకేత్‌, కీర్తనలు పాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement