
ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో మరోసారి మంచి విజయాన్నిఅందుకున్నాడు యంగ్ హీరో రామ్. కెరీర్ లో ఎక్కువగా కమర్షియల్ ఫార్ములా చిత్రాలు మాత్రమే చేసిన రామ్, ఇటీవల రూట్ మార్చాడు. నేను శైలజతో తన రొటీన్ స్టైల్ ను పక్కన పెట్టి కొత్త తరహలో కనిపించాడు. అదే బాటలో మరోసారి ఉన్నది ఒకటే జిందగీ సినిమాలోనూ కొత్త లుక్, కొత్త కాన్సెప్ట్ తో అలరించాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.
తాజాగా రామ్ తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల నాని హీరోగా నేను లోకల్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రామ్ హీరో ఓ సినిమా తెరకెక్కనుందట. ఇప్పటికే త్రినాథ్ రావు కథకు రామ్ ఓకె చెప్పాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా.. రామ్ మరోసారి కొత్త అలరిచటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.