హైపర్... అవునా? | ram pothineni in hyper | Sakshi
Sakshi News home page

హైపర్... అవునా?

Jul 12 2016 12:09 AM | Updated on Sep 4 2017 4:37 AM

హైపర్... అవునా?

హైపర్... అవునా?

రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్ అన్నంత హుషారుగా తెరపై కనిపిస్తుంటారు. అందుకే, యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ అని రామ్‌ని...

రామ్ అంటే ఎనర్జీ.. ఎనర్జీ అంటే రామ్ అన్నంత హుషారుగా తెరపై కనిపిస్తుంటారు. అందుకే, యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ అని రామ్‌ని  అభిమానులు పిలుచుకుంటారు. రామ్‌లో హుషారుని ‘కందిరీగ’తో పోల్చారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆ టైటిల్, సినిమా రెండూ సూపర్ హిట్టే. మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈసారి రామ్‌లో ఎనర్జీని ‘హైపర్’గా చూపించనున్నారట. ప్రస్తుతం రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాని నిర్మిస్తున్న 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇటీవల ఫిల్మ్ చాంబర్‌లో ‘హైపర్’ టైటిల్ రిజిస్టర్ చేయించింది.

ఈ టైటిల్ రామ్ సినిమా కోసమే అని సమాచారం. ‘శివమ్’ తర్వాత మరోసారి రాశీఖన్నా ఈ చిత్రంలో రామ్‌తో జోడీ కట్టారు. ‘కందిరీగ’ తరహాలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ ఈ నెల 14వ తేదీ నుంచి మొదలు కానుంది. నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట.

Advertisement
 
Advertisement
Advertisement